MNCL: కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ సమగ్ర అవగాహన కల్పించారు. రసాయనాలపై ఆధారాన్ని తగ్గించి సహజ పద్ధతులు అనుసరించడం ద్వారా ఖర్చులు తగ్గి, దిగుబడులు మెరుగవుతాయని వివరించారు. నేల సారాన్ని కాపాడటంలో ప్రకృతి వ్యవసాయం కీలకమని చెప్పారు. రైతులు ఈ విధానాలను స్వీకరించాలని పిలుపునిచ్చారు.