TG: బీజేపీ నేతలు సబర్మతి, గంగానది, యమునా నది ప్రాజెక్టుల గురించి గొప్పగా చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ వాళ్లే మూసీ ప్రాజెక్టును తప్పుపడుతున్నారని విమర్శించారు. మూసీ పరివాహకంలో ఎవరి అనుచరులు క్రికెట్ మైదానాలు నిర్మించారో ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్లో ముంపు, కాలుష్యం సమస్యను పరిష్కరించాలని తాము నిర్ణయించామన్నారు.