W.G: దుకాణాలు 24 గంటల పాటు తెరిచేందుకు అనుమతినిస్తూ విడుదల చేసిన జీవో నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం అంబేద్కర్ సెంటర్లో జీవోకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల కార్మికులపై పనిభారం పెరిగి, వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.