JGL: కోరుట్ల మండలంలోని చిన్నమెట్ పెల్లి గ్రామ శివారులో చేపడుతున్న రైస్ మిల్ నిర్మాణంపై బుధవారం ఉద్రిక్తత నెలకొంది. రైస్ మిల్ నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామ రైతులు, పలు కుల సంఘాల సభ్యులు కోరుతున్నారు. రైస్ మిల్ నిర్మాణం చేపట్టడంతో చిన్నమెట్ పెల్లి గ్రామంతో పాటు సమీప గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు.