KNR: TCNGOS డైరీని జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య బుధవారం సహకార భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమన్వయం, సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. డైరీ ద్వారా ముఖ్య సమాచారం అందుబాటులో ఉంటుందని, ఉద్యోగుల పని తీరును మెరుగు పరచడంలో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.