NZB: పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. నగరంలో ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతున్న ఎస్ఎఫ్ఎస్, రవి హైస్కూల్ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల చుట్టూ ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.