TG: కంప్యూటర్ దేశ భవిష్యత్తును మార్చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తొలిసారి హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాదిరాయి వేశారని చెప్పారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో నెలకొనేందుకు పీవీ విధానాలే కారణమన్నారు.