NDL: రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి బాట వేస్తుందని నంది కొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మండల కేంద్రమైన పగిడ్యాలలో రైతన్న మీ కోసం, PM కిసాన్-అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ రైతులు బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.