ప్రకాశం: కొండపిమండలంలో జాల్లపాలెం తిరునాళ్లకు పోలీస్ భద్రత ఏర్పాట్లను గురువారం కందుకూరు డీఎస్పీ పరిశీలించారు. సీఐ సోమశేఖర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పార్కింగ్ స్థలాలు, భక్తుల రాకపోకలకు సంబంధించిన కీలక మార్గాలను తిరిగి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ ఎస్సైలకు సూచించారు.