RR: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జగన్ అన్నారు. కొత్తూరు మండల నూతన ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన ముంతాజ్ బేగంను సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జగన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో వారి సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.