ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో బుధవారం వ్యవసాయ అధికారులు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను కరపత్రాల రూపంలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం వ్యవసాయమేనని ఏవో బుజ్జి భాయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు పవనేశ్వరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.