Samantha- Vijay లిప్ లాక్, శివ నిర్వాణ ఏమన్నారంటే..?
ఖుషీ మూవీలో సమంత- విజయ్ మధ్య రెండుసార్లు లిప్ లాక్ అవసరమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని డైరెక్టర్ శివ క్లారిటీ ఇచ్చారు.
Samantha- Vijay: సమంత (Samantha)- విజయ్ దేవరకొండ ( Vijay) కలిసి నటించిన ఖుషి మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ రోజే మూవీ యావరేజ్ టాక్ వినిపిస్తోంది. అయితే మూవీలో ఓ పాటలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్ ఉంటుంది. అలా రెండుసార్లు కిస్ ఉండటంపై చర్చ జరుగుతోంది. దీనిపై డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
లిప్ లాక్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అక్కడ ఉంది సమంత కాదని.. క్యారెక్టర్ ఆరాధ్య అని శివ వివరించారు. వారిద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి ఏడాది అవుతుంది.. పిల్లల కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారని.. అలాంటి జంట మధ్య లిప్ లాక్ అనేది ఒక ఎమోషన్ అని వివరించారు. వారిద్దరూ నిజంగా పెళ్లైన వారిలా కనిపించాలంటే.. అవసరం అనిపించిందని.. అందుకే లిప్ లాక్ పెట్టానని స్పష్టంచేశారు.
లిప్ లాక్ సమయంలో సమంత- విజయ్ ( Vijay) రియాక్షన్ ఏంటీ అని మరో రిపోర్టర్ అడిగారు. యాక్షన్ చెప్పగానే చేశారని.. కట్ చెప్పగానే సీన్ అయిపోయిందని వివరించారు. అదీ పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రమేనని తెలిపారు. మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రను చాగంటిని ఉద్దేశించి పెట్టారా అని అడిగారు. ఆయనను ఉద్దేశించి కాదని.. ఆ వర్గానికి చెందిన వారిలా ఉండాలని పెట్టానని తెలిపారు. అన్నీ వర్గాలను దృష్టిలో ఉంచుకొని మూవీ తీశానని వివరించారు. ఖుషీ మూవీపై సమంత- విజయ్ దేవరకొండ ( Vijay) ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాకు జనాల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని కొందరు అంటున్నారు.