ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యమని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి పేర్కొన్నారు. డైట్ విభాగంలో పనిచేసే ఫుడ్ హ్యాండ్లర్స్కు టైఫాయిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యం, పేషెంట్ల భద్రత తమకు ముఖ్యమని తెలిపారు.