నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటర్, పదవ పరీక్షలు రాసిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో కళాశాల, పాఠశాల వాహనాల్లో పేపర్లను చించి రోడ్లపై విసిరేయడం మానుకోవాలని కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించి, రహదారులను పాడు చేయకుండా చూడాలన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణిని అరికట్టాలని ఆయన ఆదేశించారు.