TPT: తిరుపతి వినాయక సాగర్‌లో నిమజ్జనానికి అనుకూలంగా మరో నీటి కుంట తవ్వాలని, భారీ నాట్య గణపతి విగ్రహం ఏర్పాటు చేయాలని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ డిమాండ్ చేసింది. కార్పొరేషన్ కమిషనర్ మౌర్యను బుధవారం కలిశారు. వెంటనే అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఇంజినీర్ శ్యాంసుందర్‌కు కమిషనర్ సూచనలు చేశారు.