VZM గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో బుధవారం పామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. పల్ల చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో ఐదు ఎకరాల పామ్ ఆయిల్ తోటలోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పి వేశారు.