అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో గురువారం ఉదయం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేద పండితుల ప్రార్థనలు, పంచాంగ శ్రవణం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలను భక్తిశ్రద్ధలతో జరపాలని సూచించారు.