MDK: లైంగిక వేధింపుల బాధితులకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను ఆయన సందర్శించి తనిఖీ నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.