»Relations With Underworld Dons Janasena Leader Arrested
Breaking: అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలు..జనసేన నేత అరెస్ట్
జనసేన నేతకు అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు కర్ణాటక పోలీసులు వెల్లడించారు. ఏపీలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వెంకటేష్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలు ఉన్న కేసులో జనసేన (Janasena) నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా జనసేన నేత వెంకటేష్ (Venkatesh) అలియాస్ విక్కీ (Vicky)ని ప్రత్యేక బృందాలు గమనిస్తూనే ఉన్నాయి. ఆయనపై నిఘా ఉంచారు. అనంతపురం (Anantapuram District)లోని కళ్యాణదుర్గం (Kalyanadurgam) నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ జనసేన నేతగా స్థానికంగా సుపరిచితుడు.
జనసేన (Janasena) చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో వెంకటేష్ పాల్గొనేవాడు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు జనసేన ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించి గతంలో వెంకటేష్ రూ.50 వేల వరకూ ఆర్థిక సాయాన్ని పార్టీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అందించారు. వెంకటేష్‌కు బెంగళూరులోని అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కర్ణాటక సీసీబీ పోలీసులు (Karnataka CCB Police) వెంకటేష్ కోసం ప్రత్యేకంగా నిఘా ఉంచారు. వెంకటేష్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి. ఓ అండర్ వరల్డ్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన కేసుల్లో కూడా వెంకటేష్ అనుమానితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.