»Vijay Devarakonda About His Life Partner National Qa With Fans Kushi Rashmika
Vijay Devarakondaకు కాబోయే భార్య ఎలా ఉండాలో తెలుసా.?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా సెప్టంబర్ 1న విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఈ యంగ్ హీరో కీలక విషయాలను పంచుకున్నారు. తనకు ఇష్టమైన ఫుడ్ సహా తన పెళ్లి గురించి, కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పారు.
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీతా గోవిందం(Geetha Govindam) సినిమాల తరువాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. లైగర్‌తో కాస్త నిరుత్సాహ పడినా మళ్లీ అంతే స్పీడ్‌తో ఖుషి(Kushi) చేయడానికి సిద్దమయ్యారు. సెన్సబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కాంబోలో వస్తున్న ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 1న) విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను విజయ్ పంచుకున్నారు.
ఆయన హైదరాబాద్ బిర్యానీ, దోశ, పల్లి చట్నీ, చీజ్ బర్గర్లను ఎక్కువగా ఇష్టపడుతానని చెప్పుకొచ్చారు. ఇక తనకు ఇష్టమైన హాలీడే స్పాట్ అంటే మాల్దీవ్స్ అని తెలిపారు. అలాగే ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతానని చెప్పాడు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ప్రశ్నకు సమాధానం వెల్లడించారు. తన పెళ్లి చాలా సీక్రెట్‌గా చేసుకుంటానని, తన వైఫ్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ ను చెప్పారు. ఇక సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే పలు సాంగ్స్ హిట్ అవడం చిత్రానికి కలిసొచ్చింది. అలాగే ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉండడం, మళ్లీ గీతా గోవిందం లాంటి ఫీల్ గుడ్ మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.