TG: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన పౌర రక్షణ వాలంటీర్ల శిక్షణ ముగిసింది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైమానిక దాడులు, రసాయన సంఘటనలు, అణు ధార్మికత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితులలో సమర్థవంతంగా స్పందించడానికి అవసరమైన నైపుణ్యాలను ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు అందించారు.