ఆసియా కప్ (Asia Cup 2023 ) మొదటి మ్యాచ్లో పాక్ జట్టు విజృంభించింది. పసికూన నేపాల్ (Nepal)పై భారీ విజయాన్ని సాధించింది. వరల్డ్ నంబర్ 1గా ఆసియా కప్లో బరిలోకి దిగిన పాకిస్థాన్(Pakistan) జట్టు ఆరంభ మ్యాచ్లోనే అదరగొట్టింది. 343 పరుగుల భారీ టార్గెట్ను నేపాల్ కు అందించింది. బరిలోకి దిగిన నేపాల్(Nepal) జట్టును 238 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది.