W.G: పెనుమంట్రలో గర్భిణులు, చంటిబిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలని ఏఎన్ఎం భాగ్య కుమారి గ్రామస్థులకు సూచించారు. టీకా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు పెద్ద సంఖ్యలో హాజరై టీకాలు వేయించుకున్నారు.