CTR: శ్రీరంగరాజపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ మహిళా కార్యకర్త కుమారమ్మ మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నివాళులర్పించారు. పార్టీ అభివృద్ధికి ఆమె చేసిన సేవలు మరువలేనివని పేర్కొంటూ, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.