బాపట్ల జిల్లా మార్టూరులో అత్యవసర చికిత్స కోసం షేక్ ఉమర్‌కు రూ. 8,00,000ల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును టీడీపీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సహాయం అందించడంలో సహకరించిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.