AP: ఇటీవల విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగాన్ని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తప్పుబట్టారు. చంద్రబాబు అసత్యలు మాట్లాడారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చలేదని తెలిపారు.