TG: మెదక్ డంపింగ్ యార్డులో ఎక్కడ చూసినా నిరోధ్ ప్యాకెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలను సుఖవ్యాధులు, ఎయిడ్స్ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఐసీటీసీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి.. అవసరమైన వారికి వినియోగించాలని సూచిస్తూ ఆస్పత్రులకు కండోమ్స్ సరఫరా చేస్తోంది. కానీ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరోధ్ ప్యాకెట్లు చెత్తకుప్పలోకి చేరాయి.