విజయనగరంలో SERP-DRDA కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై బుధవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.