SDPT: చారిత్రక నేపథ్యం ఉన్న బైరాన్ పల్లి గ్రామం పేరును ‘వీర బైరాన్ పల్లి’గా మార్చాలని కోరుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఈ గ్రామానికి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు.