అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద నేటి నుంచి కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.