MBNR: అసెంబ్లీలో బుధవారం జరిగిన క్వశ్చన్ అవర్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 25 వెంటిలేటర్ బెడ్లకు అదనంగా మరో 25 బెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగిన దృష్ట్యా, వైద్యుల సంఖ్యను కూడా పెంచాలని ఆయన తెలిపారు.