BCCI తాజాగా కాంట్రాక్ట్ జాబితాలో A+ కేటగిరీని తొలగించింది. దీంతో బుమ్రా A కేటగిరి నుంచి రూ.5 కోట్లు మాత్రమే పొందనున్నాడు. గతంలో రూ.7 కోట్లు అందుకునే బుమ్రా రూ.2 కోట్లు నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో బోర్డు పునరాలోచించి మిగిలిన మొత్తాన్ని పరిహారంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా అన్ని ఫార్మాట్లలో ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.