ఓనమ్ పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఇచ్చారా..? ఇదే అంశం గూగుల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఓనమ్ సందర్భంగా పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
School Holiday In Telangana State: తెలంగాణ రాష్ట్రంలో రేపు (మంగళవారం) పాఠశాలలకు సెలవు (School Holiday) ఇచ్చారా..? దీనిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ రోజు ఓనమ్ (ONAM) పండుగ ఉంది.. అందుకోసమే హాలీ డే ఇస్తారని కొందరు అంటున్నారు. గూగుల్ ట్రెండ్స్‌లో (Google trends) మాత్రం is Tomorrow Holiday In Telangana for Schools అని ట్రెండ్ అవుతోంది. తెలంగాణ స్కూల్ న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది. చాలా మంది యూజర్లు ఇదే అంశాన్ని సెర్చ్ చేస్తున్నారు.
ఓనమ్ (onam) పండగను కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ వారికి పెద్ద పండుగ.. అక్కడ హాలీడే ఉంటుంది. ఇక ఓనమ్ లాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సారి రూ.25 కోట్ల లాటరీ ఉందని నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో హాలీడేకు సంబంధించి క్లారిటీ లేదు. ఓమన్ మరునాడే రాఖీ పౌర్ణమి ఉంది. ఆ రోజు తెలంగాణలో ఆప్షనల్‌గా హాలీ డే ఇస్తారు. ఈ సారి రాఖీ పౌర్ణమి.. రెండు రోజులు వచ్చింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉంది. సో.. ఈ రెండు రోజుల్లో ఏదో ఒకరోజు సెలవు ఇస్తారు. ఒకరోజు ముందు కూడా అంటే ఓనమ్ పండగరోజు కూడా హాలీడే అని ట్రెండ్ అవుతోంది.
బంద్
విద్యా సంస్థల్లో ఫీజు బాదుడు.. ఇతర సమస్యలపై ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ లాంటి విద్యార్థి సంస్థలు అప్పుడప్పుడు బంద్‌కు పిలుపునిస్తాయి. సో.. అప్పుడు కూడా విద్యార్థులు ఇంటి బాట పడతారు. కేరళ పండగకు కూడా హాలీడే అని ట్రెండ్ అవుతోంది. అదేం లేదని.. మంగళవారం యథావిధిగా స్కూల్ నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి. దీంతో మంగళవారం స్కూల్ ఉందని స్పష్టమైంది. సో స్టూడెంట్స్.. స్కూల్ లేదని.. డుమ్మా కొట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు.
వర్షాలతో హాలీడే
భారీ వర్షాలతో ఇప్పటికే 10 రోజుల వరకు స్కూల్స్ పనిచేయలేదు. బంద్ పేరుతో మరో రెండు, మూడు రోజులు నడవలేదు. స్కూల్స్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతోంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో సిలబస్ పూర్తి కాలేదని టీచర్లు అంటున్నారు. హాలీడే తీసుకొని.. ఏంచక్కా బయట తిరగొద్దాం అని స్టూడెంట్స్ భావిస్తున్నారు. అందుకే స్కూల్స్ బంద్ అనే ఇష్యూ ట్రెండింగ్‌లోకి వచ్చింది.