ఒకప్పటి టాలీవుడ్ వేరు.. ఇప్పుడున్న టాలీవుడ్ పరిస్థితులు వేరు. ఎప్పుడైతే రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చారో.. తెలుగు సినిమా రూపు రేఖలే మారిపోయాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. అందుకే తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండుతోంది. ఇదే ఇప్పుడు తమిళ తంబీల కడుపు మంటకు కారణమవుతోంది.
ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ తర్వాత టాలీవుడ్ అని చెప్పుకునే వారు. పైగా తమిళ్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చేవి. అవార్డులు కూడా వాళ్లకే ఎక్కువగా వచ్చేవి. ముఖ్యంగా నేషనల్ అవార్డ్స్‌కు దూరంగా ఉండేది టాలీవుడ్. ఒక్క అవార్డ్ వస్తే చాలు.. దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునే వాఉ మనోళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టాలీవుడ్ టాప్ ప్లేస్‌కి వెళ్లిపోగా బాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు మన సినిమాల వైపు చూస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. 69 ఏళ్లలో ఎప్పుడు అందుకొని విధంగా ఏకంగా 10 నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకోగా.. ఉప్పెన సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి. పుష్ప సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ట్రిపుల్ ఆర్ సినిమాకు కీరవాణి అవార్డులు అందుకున్నారు. మొత్తంగా 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. కానీ తమిళ్ సినిమాలు మాత్రం ఈసారి రేసులో వెనకబడిపోయాయి. వాస్తవానికి కోలీవుడ్‌లో జై భీమ్, సార్పట్ట పరంపర లాంటి సినిమాలకు అవార్డ్స్ రావాల్సి ఉన్నా.. అవి ఓటీటీలకి మాత్రమే పరిమితం అయ్యాయి. అందుకే ఈసారి తమిళ్ సినిమాలకు పెద్దగా అవార్డ్స్ రాలేదు.
కానీ తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం తమకు మొండి చెయ్యి చూపించారు, మా సినిమాలకి అన్యాయం చేసారు, ఏదో లాబీయింగ్ జరిగింది.. తెలుగు సినిమాపై ఏడుస్తున్నారు. అయినా కూడా ఒకప్పటిలా తమిళ్లో సినిమాలు రావడం లేదు. కమర్షియల్ హంగులకు పోయి.. కంటెంటె లెస్ సినిమాలు చేస్తున్నారు. కాబట్టి.. తమిళ తంబీలు ఇప్పటికైనా అలాంటిటి సినిమాలపై ఫోకస్ చేస్తే బెటర్.