TG: మూసీ నదిని మురికికూపంగా మార్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. తాము మూసీ అభివృద్ధికి ఎన్నడూ వ్యతిరేకం కాదని, కేవలం రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవాలనే కుట్రను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ భారీ కుంభకోణానికి తెరలేపడం సరికాదని, ఈ దోపిడీపై తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.