TG: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పార్టీలో కొకైన్, MDMA, మెథోఇథిపిన్ అనే 3 రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి 2 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అధిక కిక్కు కోసం మద్యం, డ్రగ్స్ కలిపి వాడారని సమాచారం. కౌశిక్ రవి కొకైన్ సరఫరా చేయగా, శరత్ అనే వ్యక్తి అభిషేక్ నుంచి ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.