టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాపంగా ఆయనను చాలా మంది ఇష్టపడతారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడేళ్లయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీమిండియా(Team India)కు రెండు ప్రపంచకప్‌లు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ఘనత దక్కించుకున్న ధోనీ.. ఫిట్నెస్ విషయంలోనూ ఎప్పుడూ అత్యుత్తమంగా ఉంటారు. ధోనీని ఎంతో మంది యువ ఆటగాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా.. ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడుతూనే ఉన్నారు ధోనీ. 42 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.
ఇందుకోసం ధోనీ ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు.ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అయిదో ఐపీఎల్ టైటిల్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాహీ జిమ్‌లో చేసుకున్న పార్టీకి సంబంధించిన వీడియో వైరలైంది. దీనిలో జిమ్ సభ్యులతో కలిసి ధోనీ కేక్ కట్ చేసుకున్నారు. ‘‘ ఉండండి.. నేను కేక్ పెడతా. అయితే, మీలో ఎవరు డైట్లో ఉన్నారు? ఎవరు కేక్ తింటారో ముందు నాకు చెప్పండి’’ అని ధోనీ మాటలు వినిపించాయి. ఆ వీడియో వైరల్ (Videoviral) గా మారడంతో అభిమానులు కామెంట్లతో స్పందించారు.