»Pragyans Research On The Moon Has Started Video Shared By Isro
Chandrayan-3: చంద్రునిపై ప్రజ్ఞాన్ పరిశోధన స్టార్ట్..వీడియో షేర్ చేసిన ఇస్రో
చంద్రుని ఉపరితలంపై రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో విడుదల చేసింది. గత రెండు రోజుల నుంచి చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి బయటకు వస్తున్న రోవర్ వీడియోలను ఇస్రో నెట్టింట షేర్ చేస్తోంది.
చందమామపై భారత్ పంపిన చంద్రయాన్-3 విజయవంతం అయిన సంగతి తెలిసిందే. చంద్రయాన్3 నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై సందడి చేస్తోంది. రోవర్ తన పనిలో స్పీడ్ పెంచి పలు పరిశోధనలు చేస్తోంది. ల్యాండర్ నుంచి చంద్రుడిపై రోవర్ అటూ ఇటూ తిరుగుతూ అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోవర్ కదలికకు సంబంధించిన వీడియోలను ఇస్రో వరుసగా నెట్టింట విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఇస్రో మరో వీడియోను షేర్ చేసింది.
చంద్రుని ఉపరితలంపై తిరుగుతున్న రోవర్ వీడియో:
Chandrayaan-3 Mission: 🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై నడిచే విధానం, ఏం చేస్తుందో క్లియర్గా ఆ వీడియోలో ఇస్రో చూపించింది. సెకనుకో సెంటీమీటర్ చొప్పున రోవర్ ముందుకు కదులుతున్న వీడియోను చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23వ తేదిన చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత రోజు నుంచి చంద్రుడిపై రోవర్ కదలికల వీడియోను ఇస్రో విడుదల చేస్తూ వస్తోంది. 24న రోవర్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చే వీడియో షేర్ చేయగా 25న రోవర్ బయటకు రావడానికి ముందు ల్యాండర్ ర్యాంప్ ఎలా తెరుచుకుందని వీడియోను ఇస్రో షేర్ చేసింది.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
తాజాగా నేడు చంద్రుడిపై రోవర్ కదలికలను లోకానికి చూపిస్తూ ఇస్రో మరో వీడియోను విడుదల చేసింది. ల్యాండర్ నుంచి కొంత దూరం వరకు ముందుకు వెళ్లిన రోవర్ ఆ తర్వాత టర్నర్ తీసుకుని చంద్రుడి ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రోవర్ కదలికలను చూసి ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రుడిపై రోవర్ తిరుగాడుతున్న దృశ్యాలు ఒక ఎత్తయితే, భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలతో కూడిన రోవర్ చక్రాల ముద్రలు చంద్రుడిపై పడడం మరో ఎత్తు అని పలువురు ప్రశంసిస్తున్నారు. వరుసగా మూడో రోజు కూడా ప్రజ్ఞాన్ రోవర్ కదలికలకు సంబంధించి వీడియోను ఇస్త్రో విడుదల చేయడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.