AP: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని మంగళగిరి బస్టాండ్లో CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేఫ్, BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. అనంతరం నేతలు మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.