OGTeaserకు స్టార్ వాయిస్.. ట్రెండింగ్‌లో పవన్ మూవీ
పవన్ కల్యాణ్ ఓజీ టీజర్‌పై హైప్ నెలకొంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కానప్పటికీ మూవీకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చారు దర్శకుడు సుజిత్. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
OGTeaser: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నెక్ట్స్ మూవీ ఓజీ.. (ఓరిజినల్ గ్యాంగ్ స్టర్). మూవీని సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. సుజిత్ అంటేనే యాక్షన్ ఎలివేంట్స్.. పైగా అతను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్… ఇంకేముంది ఆ మూవీ మీద మాములు హైప్ రావడం లేదు. పాలిటిక్స్, ఇతర సినిమాల షెడ్యూల్ ఉన్నప్పటికీ ఓజీ (OG) మూవీ షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ డేట్స్ ఎక్కువ ఇస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఓజీ (OG) మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తారట.. దాంతోపాటు ఆ రోజే టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలిసింది. ఆ టీజర్‌కు కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ (arjun das) వాయిస్ ఓవర్ ఇస్తారని సమాచారం. సుజిత్ స్టైలిష్ మేకింగ్‌తో పవన్ ఓజీ (OG) స్క్రీన్ ప్రజెన్స్ బయటకు రానుంది. టీజర్ డ్యూరేషన్ 72 సెకన్లు ఉండనుంది. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ రాకుండా మూవీపై మాములు హైప్ రాలేదు. సో.. టీజర్ రిలీజ్ అయ్యాక రికార్డ్స్ బ్రేకేనని ఫ్యాన్స్ అంటున్నారు.
ఓజీ (OG) అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటున్నారు.. కానీ ఓజీ అంటే ఓజస గంభీర అని తెలుస్తోంది. దానిని షార్ట్ కట్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ అని మార్చారట. ఓజస్ గంభీర అనేది మూవీలో పవన్ క్యారెక్టర్ పేరు.. అందుకోసమే దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్‌ను సుజిత్ లాక్ చేశారని తెలిసింది. సో.. ఓజీ మూవీ టీజర్‌కు సంబంధించి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారు ఆశించిన విధంగా సుజిత్ టీజర్ తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయ్యారు.