SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామపంచాయతీలో తాగునీటి సరఫరా కోసం సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి చర్యలు చేపట్టారు. బుధవారం మంగలోల గల్లి బోరు మోటార్ బిగించి నీటి సరఫరా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవికాలం వస్తున్న సందర్భంగా త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.