రాష్ట్ర RTCలో చేపట్టిన మార్పుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, రూ.100 కోట్లతో బస్స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఏటూరునాగారం, పెద్దపల్లిలో కొత్త డిపోలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.