Thalaivar 170 Official Pooja Happening Tomorrow At Leela Palace
Rajini170: తమిళ సూపర్ స్టార్(Super Star) రజనీ కాంత్(RajaniKanth) నటించిన తాజా చిత్రం జైలర్(Jailer) ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. తాజాగా రజనీకాంత్ నుంచి తన 170వ(Rajini170) సినిమాకు రేపు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ చిత్ర దర్శకుడు జ్ఙానవేల్(Gnanavel Tha Se ) డైరెక్టర్‌గా రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
జైలర్ చిత్రంలో మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. ఆ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సెషన్ అనిరుద్ పనిచేస్తాడని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అవకాశం ఉంది. మూవీని తమిళ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ విజయానికి ముందు వరుస ప్లాఫ్లతో సతమతమైన ఈయన ఇప్పుడు రూట్ మార్చుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించడానికి సిద్దం అయ్యారు.