అందుకే ఇప్పుడు పానిండియా దృష్ట్యా కానీ, తెలుగులోనూ కూడా మోహన్ లాల్ అయితే బెటర్ అనే నిర్ణయానికి కొన్ని పెద్ద సంస్థలు, కొందరు యువదర్శకులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే నాలుగైదు సినిమాలు మోహన్ లాల్ ప్రధానపాత్రగా కథలు శరవేగంగా తయారవుతున్నాయి. కొత్త దర్శకులైతే పాత హీరోలను ససేమిరా అంటున్నారు, ఆ మేరకు నిర్మాతలను కూడా ఒప్పించుకుంటున్నారు.
పేరుకే మళయాళం గానీ, మోహన్లాల్కి దేశం మొత్తం మీద వీరాభిమానులున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినవే. అయన స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మేజిక్‌ని క్రియేట్ చేయగలిగిన హీరోలు చాలా తక్కవనే చెప్పాలి. దాదాపుగా లేరని చెప్పినా కూడా అతిశయోక్తి కాదు. మనకి తెలుగులో జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్ నటించకపోయి ఉంటే గనక దానికి అంత మైలేజే వచ్చి ఉండేది కాదన్నది ట్రేడ్ టాక్.
లూసిఫర్ సినిమా తెలుగులో కూడా చాలా మంది చూసేశారు ఓటిటిలో. కేవలం మళయాళంలోనే కాదు, ఓటిటిలో కూడా అది మామ్మూలు హిట్ కాదు. అదే సినిమా మన మెగాస్టారే చేసినా కూడా అ ఇంపాక్ట్ రాలేదు సరికదా మెగాస్టార్ కెరీర్ మరో డిజాస్టర్ నమోదైంది. ఆఫ్ బీట్ సినిమాలే మోహన్ లాల్ చేసినా, ఆ హీరో వర్షిప్ అన్నది మోహన్లాల్కి వచ్చినంత రజనీకాంత్‌కి కూడా రాలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం.
మరో సినిమా కూడా ఇప్పుడు రిలీజుకి సర్వసన్నద్ధమవుతోంది. అదే హృదయపూర్వక. ఈ టైటిల్ చూశారా? మన తెలుగులో ఎవడైనా ఇటువంటి టైటిల్ ఆహ్వానిస్తారా….అదీ అంత పెద్ద హీరోకి. పాన్ ఇండియా సినిమాలకి పెద్ద పేరే కొట్టేసినా సరే పనికిమాలిన టైటిల్స్ వెనక పరిగెట్టడంలో కూడా మన తెలుగువారే ప్రప్రథమం.
ఏదో ఒక్క విక్టరీ వెంకటేష్‌కి మాత్రం అనిల్ రావిపూడి పుణ్మమా అని సంక్రాంతికి వస్తున్నాం అనే బ్లాక్ బస్టర్ వచ్చి పరువు నిలబెట్టింది. మిగితా సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టి, బెంబేలెత్తిపోయాయి. మరో హీరో పేరు చెప్పలేని దుర్బిక్షం తెలుగు పరిశ్రమని ఏలుతోంది. అందుకే ఇప్పుడు పానిండియా దృష్ట్యా కానీ, తెలుగులోనూ కూడా మోహన్ లాల్ అయితే బెటర్ అనే నిర్ణయానికి కొన్ని పెద్ద సంస్థలు, కొందరు యువదర్శకులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే నాలుగైదు సినిమాలు మోహన్ లాల్ ప్రధానపాత్రగా కథలు శరవేగంగా తయారవుతున్నాయి. కొత్త దర్శకులైతే పాత హీరోలను ససేమిరా అంటున్నారు, ఆ మేరకు నిర్మాతలను కూడా ఒప్పించుకుంటున్నారు. నిర్మాతలు కూడా తప్పనిసరిగా ఒప్పుకోకతప్పడం లేదు.
అందుకే ఇప్పుడు ఈ డిమాండ్ రీత్యా, మోహన్ లాల్ తెలుగు నేర్చుకోవడం మీద దృష్టి సారించారని చెబుతున్నారు. ఎందుకంటే నేచుర్ యాక్టింగ్‌ని ఎంతగానో అవపోశన పట్టిన మోహన్ లాల్ తెలుగు కూడా బాగా వస్తే తన పాత్ర మరింత బాగా పండుతుందనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.