»Gadar 2 Movie Is Creating Most Collections In Box Office Day 13th
Gadar 2: బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్న గదర్ 2 మూవీ!
బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదనే చెప్పాలి. అయితే సన్నీ డియోల్(Sunny Deol) ప్రధాన పాత్రలో నటించిన గదర్ 2 మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. రిలీజ్ అయిన రోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తోంది.
Gadar 2 movie is creating most collections in box office day 13th
గదర్ 2(Gadar 2) సినిమా రెండో వారం అయినా కూడా కలెక్షన్ల(collections) జోరు మాత్రం తగ్గలేదు. సినిమా 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 13వ రోజు మరోసారి అద్బుతంగా హోల్డ్ చేసి రూ.10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. మొత్తంగా 13 రోజుల కలెక్షన్స్ లెక్క రూ.410 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ ఆల్ రెడీ దాటేసింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో నాన్ హాలిడే రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ సన్నీ డియోల్ కి ఎపిక్ కంబ్యాక్ గా నిలిచింది.
ఇక ఈ చిత్రం అద్బుతాలు సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఎలాంటి బడ్జెట్ తో తెరకెక్కింది అన్నది ఆసక్తిగా మారింది. ఈ మూవీ బడ్జెట్ చూసి ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోతున్నారని చెప్పాలి. కేవలం రూ.62 కోట్ల రేంజ్ బడ్జెట్(budget) లో ఈ సినిమాను పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా చాలా మొత్తాన్ని రికవరీ చేసిన ఈ సినిమా.. థియేట్రికల్ రన్ లో ఎపిక్ లాభాలను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.