JrNTR: సన్నీ డియోల్(Sunny Deol), అమీషా పటేల్(Ameesha Patel) ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2(Gadar 2) దూసుకుపోతోంది. 2001 బ్లాక్‌బస్టర్ గదర్ ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో తారా సింగ్‌గా సన్నీ డియోల్ అద్బుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అయితే నేటి కాలంలో తారా సింగ్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు అనిల్ శర్మ(Anil Sharma)ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ప్రస్తుత హీరోల్లో ఆ పాత్రకు సరిపోయే వారు ఎవరూ కనిపించలేదని… ముంబైలో అయితే ఎవరు లేరన్నారు. సౌత్‌లో జూనియర్ ఎన్టీఆర్(JrNTR) అయితే ఆ పాత్రకు సరిపోతాడు. అతనైతేనే ఈ పాత్రను చేయగలడు. అతనికి ఏ పాత్రలోనైనా చేయగల సత్తా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌పై ఎక్స్ సోషల్ మీడియా యాప్‌లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజనులు.
రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అలరించిన ఎన్టీఆర్.. ఆ రోల్ చేయడమే తప్పు అన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ కొరడాతో కొట్టే సీన్‌ను ఎవరి కావల్సినట్లు వారు తప్పుగా అనువాదిస్తున్నారని తాజాగా తెలుగోడు అనే ఎక్స్ యాప్‌లో ని ఓ పేజీ రాసుకొచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్స్‌లో ట్రెండింగ్ అవుతుంది. ట్రోల్ ఫుట్ బాల్‌కు సంబంధించిన ఓ పేజీలో ఫైటర్ జాన్ సీనా చేసే ఒక ఫైట్‌కు కొమరం భీముడో సాంగ్ యాడ్ చేశారు. దాంతో ట్రోల్స్ మొదలయ్యాయి.