రష్మిక మందాన (Rashmika Mandana) ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె వ్యక్తిగత సిబ్బంది ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటారు. మేకప్ అసిస్టెంట్ (Makeup assistant) వివాహం(Marriage)లో రష్మిక పాల్గోన్నారు. నూతన వధూవరులకు రష్మిక శుభాకాంక్షలు చెప్పగా.. వారి కాళ్లుకు ఆమె కాళ్లు మొక్కారు. దీంతో కాస్త కంగారు పడిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వాళ్లను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో(Video)ను రష్మిక ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.అలాగే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లిపై కూడా స్పందించారు.
తన మ్యారేజ్‌కి ఇంకా చాలా టైం పడుతుందని.. మరి కొంత సమయం కెరీర్(Career)పైనే దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్(Bollywood)లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా రానున్న ‘యానిమల్’ (Animal)లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది. అలాగే సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ (Pushpa2)లోనూ కనిపించనున్నారు. ఇక వీటితో పాటు ‘రెయిన్ బో’ (Rainbow)అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు.