AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు మళ్లీ వైసీపీలోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై బాలినేని ఎక్స్ వేదికగా స్పందించారు. పవన్ నాయకుడు మాత్రమే కాదని నమ్మకమని, ఆదరణ, ఆశ్రయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను, తన కొడుకు.. పవన్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో పార్టీ మారతారనే ఊహాగానాలకు చెక్ పడింది.