Gandeevadhari Arjuna Movie Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటించిన గాండీవధారి అర్జున మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో వరుణ్ తేజ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. మూవీలో వరుణ్ ఫిజికల్‌గా బాగున్నా.. కథ, కథనం అంతగా ఆకట్టుకోలేక పోయింది.
కథ ఏంటంటే..?
ఆదిత్యరాయ్ (నాజర్) కేంద్ర మంత్రిగా ఉంటారు. అతనికి శత్రువల నుంచి ప్రాణాప్రాయం ఉంటుంది. ఓ కంపెనీకి సంబంధించిన నివేదిక సమర్పించడానికి ఐక్యరాజ్యసమితి వెళ్లే సమయంలో బెదిరింపులు ఎక్కువ అవుతుంటాయి. థ్రెట్స్ రావడంతో భద్రత కోసం అర్జున్ (వరుణ్ తేజ) నియమిస్తారు. ఇంతకీ మంత్రిని చంపడానికి ఎవరు ట్రై చేస్తున్నారు..? వారి ఉద్దేశ్యం ఏంటీ..? ఆదిత్యరాయ్ని రక్షించి.. అర్జున్ దోషులను కనిపెట్టాడా అనేదే సినిమా స్టోరీ.
ఎలా ఉందంటే..?
గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. ఇదివరకు వచ్చిన స్పై సినిమాలను తలపిస్తుంది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఇదివరకు తీసిన గరుడ వేగ మూవీ హిట్ టాక్ అందుకుంది. తర్వాత తీసిన ఘోస్ట్ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. గాండీవధారి అర్జున కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తోంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ.. అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు. మూవీకి నెగిటివ్ టాక్ వల్ల మెగా ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..?
గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ యాక్షన్ రోల్ చేశారు. ఆ పాత్రకు హైట్ పరంగా వరుణ్ కరెక్ట్ సరిపోయారు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. తెరపై కథను అలా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాయి. మూవీలో వరుణ్ డ్రమాటిక్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆశించినట్టు రాలేదు. ఆ మూవీ వరుణ్ కెరీర్లో గుర్తుండిపోయేలా లేదు. సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తోంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎప్పటిలాగానే.. తన అనుభవాన్ని ఉపయోగించి నాజర్ నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ రోల్ చేశారు. తన పాత్ర కోసం ఎఫర్ట్స్ పెట్టారు. హీరో నిఖిల్ స్పై మూవీలో నటించిన అభినవ్ కూడా గాండీవధారి సినిమాలో అలాంటి పాత్రనే పోషించాడు. అతని నటనకు సరిపోయే రోల్ దక్కలేదనే చెప్పాలి. గాండీవధారిలో చేసిన పాత్రతో అతను సమయాన్ని కోల్పోయినట్టే అని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్‌గా
చివరికీ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా గాండీవధారి అర్జున మూవీకి ప్లస్ కాలేకపోయింది. పాటలను విన్న వెంటనే ప్రేక్షకులే మరచిపోతారని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీలకు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లా లేదు. ముఖేశ్ జీ సినిమాటోగ్రపీ ఫర్లేదు అనిపించింది. అదీ సినిమాకు కాస్త ప్లస్ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్లేదు అనిపించింది. రచన, తెరకెక్కించిన తీరు వల్లే మూవీ మైనస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ నటన
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ, కథనం
నో థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్