PLD: అమరావతిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం వినియోగదారులు బారులు తీరారు. 2,3 రోజులుగా ఆన్లైన్ బుకింగ్ కాకపోవడంతో గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. నేరుగా ఏజెన్సీ వద్దకు వచ్చి ఆన్లైన్ చేయించుకుని సిలిండర్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వర్ బిజీ వల్ల కొంత జాప్యం జరుగుతోందని, ఆన్లైన్ విధానంలో ఎలాంటి సమస్య లేదన్నారు.